ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్స్... వెజిటేరియన్స్ కోసం
ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్స్... వెజిటేరియన్స్ కోసం

BP, హైపర్ టెన్షన్ మరియు గుండె జబ్బులు నియంత్రణ కోసం చాలామంది ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా లభించే చేపలని ఆహారంగా తీసుకుంటారు. మరి శాఖాహారులు చేపలు తినలేరు కదా, వాళ్ళకు ఒమేగా3 ఫ్యాటి ఆసిడ్స్ ఎలా లభిస్తాయనేగా మీసందేహం... ఐతే ఇది మీకోసమే...

ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్స్ చేపలలో మాత్రమే లభిస్తాయి అనుకోవడం అపోహ మాత్రమే, ఎందుకంటే అవి శాఖాహరంలోను లభిస్తాయి. ఒమేగా3 ఫ్యాటి ఆసిడ్స్ ఎక్కువగా ఉన్న శాఖాహర పదార్థాలేమిటంటే...

పాలకూర, అక్రోట్లు ( Walnut ), పచ్చ గోబీ ( Broccoli ) లలో కూడా ఒమేగా3 ఫ్యాటి ఆసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.

వెల్లుల్లి:

వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లి రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్ మరియు గ్లూకోజ్ లెవెల్ ని తగ్గిచడానికి చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే అప్పటికప్పుడు వలిచిన తాజా వెల్లుల్లిని తీసుకోవడం చాలా మంచిది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ లో యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

Posted On 25th March 2018