చంద్రబాబుకి మమత భెనర్జీ, సిద్ధారామయ్య మద్దతు
చంద్రబాబుకి మమత భెనర్జీ, సిద్ధారామయ్య మద్దతు

అమిత్ షా లేఖపై చంద్రబాబు గట్టిగా స్పందిచడం, ఆ లేఖలోనివన్ని అబద్దాలని లెక్కలతో సహా అసెంబ్లీలో వివరించడం అందరికీ తెలిసిందే.

దీనితో చంద్రబాబు మద్దతు వెల్లువెత్తుతోంది. మొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత భేనర్జీ మద్దతుగా ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ సారంశం ఏంటంటే “ నిజాలు బయటపెట్టిన చంద్రబాబుని నేను అభినందిస్తున్నాను, ఇది మంచి పరిణామం. చాలామంది నేతలు ( BJP నేతలను ఉద్దేశించి ) అబద్దాలను వ్యాప్తిచేసే పనిలో ఉన్నారు. రాష్ట్రాలకు వాళ్ళేదో చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు ” అని ట్వీట్ చేసారు.

అయితే అనుకోని విధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా చంద్రబాబుకి మద్దతుగా ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ సారంశం ఏంటంటే “ అమిత్ షా రాజ్యాంగం మీద, సెంట్రల్ టాక్స్ ల మీద ఏమాత్రం అవగాహన లేదు. ఆయన అబద్దాలు చెబుతున్నారు. కర్నాటకకు 90 వేల కోట్లు ఇచ్చి, 2 లక్షల కోట్లు ఇచ్చమని అబద్ధం చెబుతున్నారు. న్యాయంగా రావాల్సిన వాటిని, ఎదో దానం చేసినట్లు అమిత్ షా అనుకుంటున్నారు ” అని ట్వీట్ చేసారు.

Posted On 27th March 2018

Source wikipedia