జగన్, విజయసాయి విభేదాలు... అందుకే రాజీనామా చేయలేదు
జగన్, విజయసాయి విభేదాలు... అందుకే రాజీనామా చేయలేదు

ప్రత్యేకహోదా పోరులో భాగంగా YSR కాంగ్రెస్ ఎంపిలు అందరూ రాజీనామాలు సమర్పిస్తారని, ఆ తర్వాత నిరాహార దీక్షకు దిగుతారని జగన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలోనే విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం సాగింది.

అయితే దాన్ని ధృవీకరిస్తూ నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలతో అది నిజమే కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మొదట ఎంపిలందరూ రాజీనామా చేస్తారని పదే పదే ప్రకటించినా, చివరకు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయలేదు.

దీని గురించి ప్రశ్నించగా లోకసభ ఎంపిలు మాత్రమే రాజీనామాలు సమర్పిస్తామని చెప్పామని, రాజ్యసభ ఎంపిలు రాజీనామా చేస్తామని ఎప్పుడు ప్రకటించలేదని అంటున్నారు YSR కాంగ్రెస్ నేతలు. లోకసభ అయినా, రాజ్యసభ అయినా ఎంపిలు ఎంపిలే. ఈ చిన్న లాజిక్ YSR కాంగ్రెస్ నేతలు ఎలా మిస్ అయ్యారో అర్ధం అవడంలేదు.

అయితే జరుగుతున్న చర్చ మాత్రం దీనికి భిన్నంగా ఉంది, అదేంటంటే మొదట ఎంపిలందరూ రాజీనామా చేయాలనే విషయాన్ని జగన్ వెల్లడించారని, అయితే దీనితో విజయసాయిరెడ్డి తీవ్రంగా విభేదించారని అందుకే రాజీనామాకు ఒప్పుకోలేదని చర్చించుకుంటున్నారు.

ఏది ఏమైనా ఎంపిలు అంటే ఎంపిలే. రాజ్యసభ అయినా, లోకసభ అయినా MP అంటే Member of Parliment అనే అర్ధం వస్తుంది.

Posted On 7th April 2018