శ్రీరెడ్డి వెనుక YSR కాంగ్రెస్ ?
శ్రీరెడ్డి వెనుక YSR కాంగ్రెస్ ?

శ్రీరెడ్డి... గత కొద్ది రోజులుగా TV ఛానెల్స్ లో హలచల్ చేస్తున్న పేరు. వార్తా చానళ్ళ చర్చల్లో, YouTube లో, వెబ్ మీడియాలో ఈ మధ్య ఎక్కడ చూసినా ఈవిడే కనిపిస్తుంది. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి, అర్ధనగ్నంగా నిరసన తెలిపి తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే మొన్న పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి గందరగోళాన్నే సృస్ష్టించింది.
ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు. అంతే కాకుండా రాజకీయలకు అతీతంగా శ్రీరెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు.
అయితే ఈ శ్రీరెడ్డి వెనుక, శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక YSR కాంగ్రెస్ పార్టీ ఉందంటూ సామజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలను ఫోటో ఆధారాలతో సహా పవన్ అభిమానులు, నెటిజన్లు సామజిక సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ప్రచురిస్తున్నారు.
మీరు పై ఫోటో గమనిస్తే, శ్రీరెడ్డి నిన్న పవన్ ని తిట్టే సమయంలో పక్కనే ఉన్న ఈ అమ్మాయి YSR కాంగ్రెస్ నియోజికవర్గ ఆఫీస్ లో ఉన్న ఫోటో కూడా కనిపిస్తుంది. అంతేకాక కత్తి మహేష్ పక్కన ఉన్న ఫోటోలో కూడా ఉంది.
పైన పేర్కొన్న అన్ని విషయాలు ఈ వార్తను ద్రువీకరించేలా ఉన్నా, అయితే ఇది ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.

Posted On 17th April 2018