ఫుట్‌బాల్‌లో రొనాల్డో... క్రికెట్‌లో కోహ్లి - బ్రావో
ఫుట్‌బాల్‌లో రొనాల్డో... క్రికెట్‌లో కోహ్లి - బ్రావో

ఫుట్‌బాల్‌ లో రొనాల్డొ ఎంత గొప్ప ఆటగాడో... క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ అంత గొప్ప ఆటగాడు. విరాట్‌, నా తమ్ముడు డారెన్‌ అండర్‌ -19 క్రికెట్‌ ఆడుతూ ఉండేవారు. ఆ సమయంలో నేను డారెన్‌కు కోహ్లీ ఆట తీరును చూస్తూ ఉండమని చెబుతూ ఉండేవాడిని. ఒకసారి కోహ్లీని నా తమ్ముడు డారెన్‌తో బ్యాటింగ్‌, క్రికెట్‌ గురించి మాట్లాడాలని అడిగాను కూడా. నాకు కోహ్లీని చూస్తే క్రికెట్‌లో క్రిస్టినా రొనాల్డోను చూసినట్లే ఉంటుంది. ఒక క్రికెటర్‌గా నాకు కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడటాన్ని ఇష్టపడతా. అంతేకాదు భారత్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున అతను ఆడుతుంటే చూస్తా. అతని ప్రతిభ చూసి నేను ఆశ్చర్యపోతాను. క్రికెట్‌ అంటే కోహ్లీకి చాలా ఇష్టం. క్రికెట్‌లో ఏవైతే ఘనతలు కోహ్లీ అందుకున్నాడో వాటన్నింటికీ అతడు అర్హుడుఅని బ్రావో అన్నాడు.

Posted On 17th April 2018