రామ్మోహన్‌నాయుడు మెరుపు దీక్ష
రామ్మోహన్‌నాయుడు మెరుపు దీక్ష

ప్రత్యేక రైల్వేజోన్‌ సాధన కోసం TDP ఎంపి రామ్మోహన్‌నాయుడు ఆమదాలవలస పట్టణంలోని శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌లో మెరుపు దీక్ష చేపట్టారు. సోమవారం రాత్రి ఏడింటి నుండి మంగళవారం ఉదయం ఏడింటి వరకు రైల్వేస్టేషన్‌లో దీక్ష కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ...

ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ హామీలను అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. రైల్వే జోన్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని ఒడిశా ముఖ్యమంత్రి స్పష్టం చేసినప్పటికీ కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తుందో అర్థం కావడం లేదన్నారు. రాజీనామాల విషయంలో వైకాపా దొంగాట ఆడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీగా ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో 12 గంటల నిరసన దీక్ష చేస్తున్నానని తెలిపారు. ఇక్కడే పడుకొని తమ నిరసనను ప్రధానికి తెలియజేస్తున్నామని తెలిపారు.

Posted On 17th April 2018