లండన్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. కథువా అత్యాచార ఘటనను నిరసిస్తూ కొన్ని సంఘాలు లండన్లో నిరసన వ్యక్తం చేశాయి. అసిఫా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. సౌత్ ఏసియా సాలిడారిటీ గ్రూప్ ఆధ్వర్యంలో వాహనాలపై పెద్దపెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి మోదీ నాట్ వెల్కమ్, జస్టిస్ ఫర్ అసిఫా అని నినాదాలను ప్రదర్శించారు. బ్రిటన్ పార్లమెంట్ ఎదుట భారతీయ మహిళా సంఘాలు మౌన ప్రదర్శన నిర్వహించాయి. దీంతో ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Posted On 18th April 2018