ఆడపిల్లల జోలికొస్తే... వాళ్ళకి అదే చివరి రోజు
ఆడపిల్లల జోలికొస్తే... వాళ్ళకి అదే చివరి రోజు

ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కలగాలని, ఆంబోతుల మాదిరి బజారున పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఆడవారి జోలికెళ్తే ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందేనని, వారికి అదే ఆఖరి రోజు అవుతుందని చద్రబాబు హెచ్చరించారు. దాచేపల్లిలో దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని, ఈ దురాగతాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు.

ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా కఠినంగా చట్టాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులు ఏ స్థాయివారైనా సహించేది లేదన్న సీఎం.... లైంగిక వేధింపులపైనా నిశ్శబ్దాన్ని ఛేదించాలన్నారు. ఫోక్సో చట్టంలో సవరించిన నిబంధనలపై ప్రజలను చైతన్యపరచాలని అధికారులకి సూచించారు.

దొరికినా ఉరి శిక్ష తప్పదనే భయంతోనే ఆత్మహత్య

48 గంటల్లోనే కేసు ఛేదించాం, దొరికినా ఉరి శిక్ష తప్పదనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో దాచేపల్లి ఘటనే ఆఖరిది కావాలని, ఆడవారిపై అత్యాచారం చేస్తే ఉరికంబం ఎక్కిస్తామని, ఎంత గొప్పవాళ్లయినా ఉపేక్షిచం అని ఆయన అన్నారు.

Posted On 5th May 2018