మందుకొట్టి హాస్పిటల్ కి... లేడీ డాక్టర్ నిర్వాకం
మందుకొట్టి హాస్పిటల్ కి... లేడీ డాక్టర్ నిర్వాకం

వైద్యో నారాయణో హరి అంటుంటారు, ఎందుకంటే వైద్య వృత్తిలో వుండే గొప్పతనం అది. తమ చికిత్స ద్వారా ఎన్నోప్రాణాలు కాపాడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో సేవ తక్కువై వ్యాపారం ఎక్కువైనా డాక్టర్ పట్ల ఉండే గౌరవం మాత్రం అలానే ఉంది.
కాని ఒక లేడీ డాక్టర్ చేసిన నిర్వాకం వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే…
హర్యానా రాష్ట్రంలో పంచకుల జిల్లా రాయపూర్ రాణి టౌన్‌లో ప్రభుత్వాసుపత్రి ఉంది. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో పనిచేసే లేడీ డాక్టర్ రిసెప్షన్ దగ్గర తూలుతూ కనిపించింది. ఆమెను గమనించిన ఓ వ్యక్తి.. ఏమిటి మేడం అలా ఉన్నారు అని అంటే సమాధానం సరిగా చెప్పలేదు. మీ డ్యూటీ ఎక్కడ అని అడిగేసరికి ఎమర్జెన్సీ వార్డులో అని సమాధానం చెప్పింది. ఆ వార్డులో ఎంత మంది ఉన్నారంటే ముగ్గురు అని చెప్పింది. ఎంతమందికి వైద్యం అందించారు అని అడిగితే నీకెందుకు స్టుపిడ్ అని అతడిని తిట్టింది.
అయితే అక్కడే ఉన్న మరో వ్యక్తి ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి, హాస్పిటల్ సిబ్బందికి సమాచారం అందించాడు. అధికారులు విచారణ జరిపి, మధ్యం తగినట్లు నిర్ధారించారు.
తాగిన మత్తులో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న రోగులకు ఎలాంటి ట్రీట్ మెంట్ అందించిందో ?

Posted On 10th May 2018

Source eenadu