TDP కి షాక్... KCR తో‌ పోటీపడ్డ నేత రాజీనామా
TDP కి షాక్... KCR తో‌ పోటీపడ్డ నేత రాజీనామా

తెలంగాణా లో TDP గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. దాదాపు బలమైన, గెలవగలిగిన నాయకులందరూ TRS, కాంగ్రెస్ ల్లోకి జంప్ అయ్యారు.
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మరో సీనియర్ నేత, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో KCR కే గట్టి పోటీ ఇచ్చిన వంటేరు ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో KCR పై ఓడిపోయినప్పటికీ గట్టి పోటీని ఇవ్వగలిగారు. KCR లాంటి బలమైన నాయకుడు సొంత నియోజికర్గంలో, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసి అతి సాధారణ మెజారిటీతో గెలుపొందారు. అదికుడా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికలు, దీన్ని బట్టి గజ్వేల్ లో ప్రతాపరెడ్డి ఎంత బలమైన నాయకుడో అర్ధమవుతుంది.
ప్రతాప్‌రెడ్డి మల్లన్న సాగర్ విషయం లో రైతుల పక్షాన నిలబడి గట్టిగా పోరాడారు.
ఓయూలో విద్యార్థి మురళి ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సందర్భంలో ప్రభుత్వం తనపై కక్ష గట్టి అక్రమ కేసులతో జైలుకు పంపిందని, అయితే ఈ పోరాటాల్లో టీడీపీ తెలంగాణ నాయకత్వం తనకు అండగా నిలవకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ చేరుతారని సమాచారం.

ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం ఉన్న పరిస్థితుల్లో, ఇలాంటి నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Posted On 13th May 2018