పవన్ వెంట... YSR కాంగ్రెస్ నేత ?
పవన్ వెంట... YSR కాంగ్రెస్ నేత ?

పవన్ కళ్యాణ్ తిరుమలలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన స్వామివారి దర్సనం అనంతరం కొండపై ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. అయితే సోమవారం తీర్థాల సందర్శనలో ఉన్న ఆయన వెంట YSR కాంగ్రెస్ తరుపున ఏలూరు MP గా పోటీచేసిన తోట చంద్రశేఖర్ ఉండడం పలు చర్చలకు తావిస్తోంది.

 

2014 ఎన్నికల్లో YSR కాంగ్రెస్ తరపున లోకసభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన, మాగంటి బాబుపై పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మాగంటి బాబు 1 లక్షా పంతొమ్మిది వందల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.

అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మాత్రం తోట చంద్రశేఖర్ YSR కాంగ్రెస్ నుండి ఎప్పుడో దూరంగా జరిగారని, త్వరలో జనసేనలో చేరతారని చెప్తున్నారు. అయితే జనసేన తరపున ఎవరో ఒకరు స్పందించి నిజానిజాలు చెపితే గానీ అసలు నిజం తెలుస్తుంది, ఈ చర్చలకు బ్రేక్ పడుతుంది.

Posted On 14th May 2018