శివాజీ పై BJP కార్యకర్తల దాడి
శివాజీ పై BJP కార్యకర్తల దాడి

తెలుగు నటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు శివాజీపై గన్నవరం విమానాశ్రయంలో BJP కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. కొత్తగా AP BJP అధ్యక్షుడుగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తుండగా ఆయనకు స్వాగతం పలకడానికి కొందమంది BJP నేతలు వచ్చారు.

సరిగ్గా అదే సమయంలో శివాజీ ఎయిర్‌పోర్టుకు వచ్చారు, శివాజీని చూసిన BJP కార్యకర్తలు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేసారు. అంతటితో ఆగకుండా దాడికి కూడా ప్రయత్నించారు.

అయితే శివాజీ కూడా ఏమాత్రం భయపడకుండా ప్రత్యేకహోదాపై వాళ్ళని గట్టిగా నిలదీసారు. ప్రాణంపోయినా సరే AP ప్రత్యేకహోదా కోసం పోరాడుతానని అన్నారు.

Posted On 16th May 2018

Source eenadu