205 కోట్లు కొల్లగొట్టిన భరత్
205 కోట్లు కొల్లగొట్టిన భరత్

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. 3 వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 205 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మహేష్ బాబు కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా ఈ సినిమా నిలిచింది.

శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో ఈ సినిమా రావడం, మంచి కథ, మహేష్ బాబు పెర్ఫార్మన్స్ సినిమా విజయానికి దోహదపడ్డాయి. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కైరా అద్వాని తన అందం, అభినయంతో మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది.

ఈ సినిమా తర్వాత విడుదలైన నా పేరు సూర్య సినిమా అంతగా ఆకట్టుకోకపోవడం కూడా ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది.

Posted On 16th May 2018

Source eenadu