అడ్డంగా దొరికిపోయిన... YSR కాంగ్రెస్ MLA
అడ్డంగా దొరికిపోయిన... YSR కాంగ్రెస్ MLA

తీగ లాగితే డొంకంతా కదిలింది. నెల్లూరు లో మొదలైన కేసు మంగళగిరి వచ్చింది. విశేషమేమంటే అక్కడా, ఇక్కడా ఈ బెట్టింగ్ మాఫియాలో ఉన్నది YSR కాంగ్రెస్ ఎంఎల్ఏ లే. క్రికెట్‌ బెట్టింగ్‌లతో జనాన్ని కొల్లగొడుతోన్న బుకీలకు నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అండగా నిలిచారని ఆ జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్న కుమారుడు కాంట్రాక్టరును డబ్బు కోసం కిడ్నాప్‌ చేయడంతో, రంగంలోకి దిగిన ACB దర్యాప్తు జరపగా గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చింది.

రాజధాని ప్రాంతంలో అవినీతిపరుడిగా ఆరోపణలున్న పోలీసు అధికారి దుర్గాప్రసాద్‌పై గతేడాది జనవరిలో ACB ఆదాయానికి మించి భారీగా అవినీతి ఆస్తులున్నాయని కేసు నమోదు చేసింది. ACB కి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ (CIU) ను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా తుళ్లూరు ప్రాంతంలో కొన్ని స్థిరాస్తులు ఇతరుల పేర్లతో ఉన్నట్లు బయటపడింది.

వాటిపై విచారణ జరపగా డీఎస్పీ బినామీల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నట్లు తేలింది. MLA భార్య పేరుతో ఉన్న ఆస్తుల పత్రాలు డీఎస్పీ ఇంట్లో లభించడంతో ఏసీబీ అధికారులు ఆయనకు బుధవారం నోటీసు ఇచ్చారు. ఈ నెల 22న విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చి వివరాలు వెల్లడించాలని పేర్కొన్నారు.

Posted On 17th May 2018