రంగరాజన్ గారికి 5 ప్రశ్నలు
రంగరాజన్ గారికి 5 ప్రశ్నలు

చిలుకూరి బాలాజీ గుడి ప్రధాన అర్చకుడు రంగరాజన్ గురించి తెలియని తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఆయన అప్పుడప్పుడు TV చర్చల్లో కూడా పాల్గొంటారు. అయితే మొదటిసారి గుడిలో రాజకీయ వ్యాఖ్యలు చేసారు, అది కూడా చంద్రబాబు, లోకేష్ మరియు బాలకృష్ణను ఉద్దేశించి వివదాస్పద వ్యాఖ్యలు చేసారు.

TTD లో వారసత్వం ఆధారంగా కాకుండా, అర్హత కలిగిన వారికే ప్రధానర్చకుడి పదవి ఇవ్వాలని నిరయించడం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఆయన చంద్రబాబు, లోకేష్ మరియు బాలకృష్ణను ఉద్దేశించి వివదాస్పద వ్యాఖ్యలు చేసారు.

అయితే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరిడిగా ఆయనకు 5 ప్రశ్నలు

  1. ఏం అర్హత ఉందని లోకేష్ కి MLC, మంత్రిపదవి ఇచ్చారు, అది వారసత్వం కాదా అని అడిగారు కదా… మంత్రి పదవి కాని, MLC కాని 5 సంవత్సరాలే… జనానికి ఇష్టం లేకపోతే మళ్ళీ అవకాశం ఉండదు.
    కానీ మీది అలా కాదుగా, ఇక్కడ వారసత్వం అంటే గడిచిన తరాలు, రాబోయే తరాలు కూడా మీరే అర్చకులా ? వేరే పేద బ్రాహ్మణులకు అవకాశం ఉందా ?
  2. TTD ఆదాయంలో తెలంగాణకు కూడా వాటా కావాలని మీరు పిటిషన్ వేసింది నిజం కాదా ?
  3. గుళ్ళో రాజకీయాలు మాట్లడడం సమంజసమేనా ? గుడిలో రాజకీయాలు మాట్లాడిన మీరు, ప్రధాన అర్చకుడి పదవికి అర్హులేనా ?
  4. చిలుకూరి గుడిలో కానుకలు ఉండవని చెప్తూనే, పుస్తకాలు బలవంతంగా కొనిపించడం సమంజసమేనా ? బలవంతంగా అంటే, అవి కొనేలా మీరు మోటివేట్ చేసేది నిజం కాదా ?
  5. చిలుకూరి గుడిలో పాలిథీన్ బ్యాన్ చెసారని, పేపర్ కవర్ రూ 5 కు బలవంతంగా బయట అమ్మే విషయం మీకు తెలియదా ?

Posted On 20th May 2018