రాజ్‌నాథ్‌ హెలికాప్టర్ కోసం... 20 గ్రామాలకు కరెంట్ కట్
రాజ్‌నాథ్‌ హెలికాప్టర్ కోసం... 20 గ్రామాలకు కరెంట్ కట్

కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెలికాప్టర్ కోసమని దాదాపు 20 గ్రామాలకు కరెంటు సరఫరా నిలిపివేశారు. వేసవి కాలం కావడంతో జనాలు నానా ఇబ్బంది పడ్డారు. గతంలో కూడా ప్రధానమంత్రి కోసమని పాపం ఒక రైతు పంటని బలవంతంగా కోయించారు. ఈ రెండు సంఘటనలు మధ్యప్రదేశ్ లోనే జరగడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే సాంతాలోని కోఠినగర్‌ పంచాయతీలో ఈరోజు రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యస్తున్నారు. అయితే ఆయన హెలికాప్టర్ సురక్షితంగా దిగడం కోసమని సాంతా పరిధిలోని దాదాపు 20 గ్రామాలకు కరెంటు సరఫరా ఆపేసారు. ఆ ప్రాంతం గుండా హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు వెళ్తున్నాయని, అందుకే శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకూ విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీనికోసం వార్తాపత్రికల్లో ప్రకటన కూడా జారీ చేశారు.

Faasos web cps IN

దీంతో ఆ 20 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అసలే మండే వేసవి కాలం, దానితో కరెంటు లేకపోవడంతో నీళ్ళు లేక, ఉక్కపోతతో జనం చాలా అవస్థలు పడ్డారు. చిన్నపిల్లల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ పర్యటన వల్ల జనాలకు ఒరిగింది ఏంటో తెలియదు కానీ, ఇబ్బంది మాత్రం పడాల్సి వచ్చింది. హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లుంటే, జనాలకు ఇబ్బంది తప్పి ఉండేది.

Posted On 20th May 2018