కూటమి దిశగా... అడుగులు
కూటమి దిశగా... అడుగులు

దేశరాజకీయాల్లో కొత్త కూటమి రాబోతుందా ? అంటే ఖచ్చితంగా రాబోతుందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగిన కుమారస్వామి ప్రమాణ స్వీకర కార్యక్రమం చూస్తే ఎవ్వరికైనా అర్ధమవుతుంది. BJP వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చేశాయి. కానీ ఈ ఫ్రంట్ కాంగ్రెస్ తో కలిసి ఉంటుందా, లేక విదిగానేనా అన్న క్లారిటి మాత్రం లేదు.

అయితే NDA, UPA కూటముల్లో లేని భావ సారూప్యత కలిగిన పార్టీలు సమావేశమయ్యేందుకు, వివిధ అంశాలపై చర్చించుకునేందుకు కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికగా మారింది. బెంగళూరులో బుధవారమంతా వీరి మధ్య సమావేశాలు సాగాయి. చంద్రబాబు కాంగ్రెస్‌ మినహా మిగిలిన పార్టీల నేతలందరితోనూ భేటీ అయ్యారు. ప్రాంతీయ పార్టీల మధ్య సంబంధాల్ని బలోపేతం చేసేందుకు మరింతగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగానే నాయకులు అభిప్రాయపడ్డారు.

RelianceTrends CPV (IN)

చంద్రబాబు పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, దిల్లీ వంటి రాష్ట్రాలకు స్వయంగా వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం, రాజ్యసభలో ఏపీకి ఇచ్చిన హామీల అమలు కోసం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తాము చేసే ఆందోళనకు మద్దతివ్వాలంటూ ముఖ్యమంత్రులను కోరాలని భావిస్తున్నారు. SP, BSP, వామపక్షాలు నేతల వద్దకూ ఇదే విధమైన అజెండాతో వెళ్లి భేటీ కానున్నారు. దీంతోపాటు ఎన్‌డీఏ, యూపీఏ కూటముల్లో లేని ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులతో విజయవాడలో సమావేశం నిర్వహించాలన్న ప్రతిపాదనను చంద్రబాబు చురుకుగా పరిశీలిస్తున్నట్లు TDP వర్గాల కథనం.

Aliexpress IN

Posted On 24th May 2018