గెలుపు మాత్రమే తెలిసిన... యుద్ధం పుట్టిన రోజు
గెలుపు మాత్రమే తెలిసిన... యుద్ధం పుట్టిన రోజు

రచయిత సాయిమాధవ్ బుర్రా NTR జన్మదినాన్ని పురస్కరించుకుని రాసిన కవిత అదిరిపోయింది.

ఈ‌ రోజు
మాట్లాడే సింహం పుట్టిన రోజు

గెలుపు మాత్రమే తెలిసిన యుద్ధం పుట్టిన రోజు

తలవంచుటే తెలియని ఓ జాతి జెండా పుట్టిన రోజు

తెలుగు కళామతల్లికి గర్వం పుట్టిన రోజు

వెండితెర మీద ఏం మాత్రం వెలిసిపోని విన్నూత్న వర్ణం పుట్టిన రోజు

కొన్ని కోట్ల మంది పాఠకులకు ముందడుగు పుట్టిన రోజు

మనిషంతా వెచ్చదనం మనసంతా చల్లదనం
బతుకంతా పరిమళించిన తెలుగుదనం పుట్టిన రోజు

NTR పుట్టిన రోజు

పేదవాడి అన్నం ముద్ద ఉడికిన రోజు

Posted On 27th May 2018

Source eenadu