చంద్రన్న భీమా తరహాలో... తెలంగాణాలో రైతు భీమా
చంద్రన్న భీమా తరహాలో... తెలంగాణాలో రైతు భీమా

కొన్ని పథకాలు ఎన్నికల కోసం, పేరు కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం ఉంటాయి. అలాంటి వాటిలో ముందు వరుసలో ఉండే పథకం చంద్రన్న భీమా. 2016 లో అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు ఆలోచనల్లోంచి రూపుదిద్దుకొన్న ఈ పథకం ఎంతోమందికి అండగా నిలిచింది. సహజ మరణం అయితే 2 లక్షలు, అదే ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు రూపాయిలు భీమాగా అందుతుంది. చంద్రన్న భీమాకి సంబంధించిన మరిన్ని విషయాలు ఇక్కడ చూడవచ్చు. http://chandrannabima.ap.gov.in

అయితే ఈ పథకం స్ఫూర్తిగా తెలంగాణ లో కూడా ఒక పథకం రాబోతుంది. అదే రైతు భీమా, ఈ మధ్యే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అయితే ఇక్కడ ఎలాంటి మరణమైనా 5 లక్షలు భీమాగా అందించడం విశేషం. కాకపోతే ఈ పథకం కేవలం రైతన్నల కోసమే. అయితే ఆంధ్రప్రదేశ్ లో లాగా భూమి లేక కూలి చేసుకునే రైతు కూలీలు, కార్మికుల కోసం కూడా ఈ పథకాన్ని విస్తరిస్తే బావుంటుంది.

Posted On 6th June 2018