ఆటో డ్రైవర్ ప్రాణాలు కాపాడిన AP మంత్రి
ఆటో డ్రైవర్ ప్రాణాలు కాపాడిన AP మంత్రి

కొవ్వూరు మండలం లో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. చేబ్రోలుకు చెందిన ఆటో డ్రైవర్‌ కామిశెట్టి వీర వెంకట సత్యనారాయణ దొమ్మేరు జాతరకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఆటో బోల్తా కొట్టింది.

సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న మంత్రి జవహర్‌ ప్రమాదాన్ని చూసి కాన్వాయ్‌ ఆపించి, స్వయంగా సిబ్బంది, పోలీసులతో కలసి సహాయక చర్యలు చేపట్టారు. ఆటోను పైకి తీసి డ్రైవర్‌ను కాపాడారు. అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్‌ ను ఆసుపత్ర్హికి తరలించారు.

Posted On 5th June 2018