టీం జగనన్న... జాయిన్ అయితే రూ 100
టీం జగనన్న... జాయిన్ అయితే రూ 100

మీరు చూసింది నిజమే. యాప్ లో జాయిన్ అయితే రూ 100. ఆ తర్వాత లైక్ కి ఓ రేటు, షేర్ కో రేటు, కామెంట్ కో రేటు. ఆశ్చర్యంగా అనిపించే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టీం జగనన్న ( Team Jagananna ) పేరుతో నిర్వహిస్తున్న అప్లికేషన్ కు సంబంధించిన ఈ స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. ఇది నిజం అయితే ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. పెయిడ్ మీడియా అనే విమర్శను అంగీకరించినట్లే అవుతుంది.
ఇది ఇలాగే కొనసాగితే ఎవరు డబ్బు కోసం చేస్తున్నారో, ఎవరు అభిమానంతో చేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం.
ఏది ఏమైనా ఒక పార్టీ డబ్బు ఇచ్చి లైకో, పేరో కొట్టించుకోవడం అంటే పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని అర్థం. లేదా లెక్కలేనంత డబ్బు ఉందని అర్ధం.

Posted On 19th June 2018