ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకూ ఇవ్వాల్సిందే
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే..  తెలంగాణకూ ఇవ్వాల్సిందే

AP కి ప్రత్యేక హోదా కోరుతూ TDP ఎంపి కేశినేని నాని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ తీర్మానానికి దేశ వ్యాప్తంగా BJP వ్యతిరేక పక్షాలన్నీ మద్దతు తెలపనున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, DMK నేత కనిమొలి, RJD అధినేత లాలూప్రసాద్ యాదవ్ మద్దతు తెలిపారు.
అయితే TRS అధినేత KCR మాత్రం తీర్మానానికి మద్దతు తెలిపేది లేదని స్పష్టం చేసారు. మోడికి వ్యతిరేకం అంటూనే, BJP కి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవడం వెనక కారణమేంటో ?
దీంతో TRS, BJP లు ఒక్కటే అని కాంగ్రెస్ చేస్తోన్న వాదన నిజమేనేమో అనిపిస్తోంది.
ఇక్కడితో ఆగకుండా "ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకూ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం. పారిశ్రామికంగా నష్టదాయకం. పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉంది. ఏపీకి ఎన్నోవిధాలుగా, ఎన్నోరకాలుగా సాయం అందించినా, నిధులిచ్చినా మేం అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీసేలా ఏపీకి మేలు చేయాలనే ప్రయత్నాలను మాత్రం అడ్డుకోవాలి. వీటన్నింటిపై చర్చలో ప్రస్తావించాలి" అని ఎంపీలకు సూచించారు.

Posted On 20th July 2018