రెండు రాష్ట్రాల్లోనూ ఓడిపోయిన BJP
రెండు రాష్ట్రాల్లోనూ ఓడిపోయిన BJP

మధ్యప్రదేశ్, ఒడిశా లో మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో BJP ఓటమి పాలయ్యింది. మధ్యప్రదేశ్ లోని ముంగాలి, కొలారస్ మరియు ఒడిశా లోని బీజేపూర్ అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 24 న ఉప ఎన్నికలు జరిగాయి. కాగా ముంగాలి లో కాంగ్రెస్ అభ్యర్థి బ్రజేంద్ర సింగ్ యాదవ్, కొలారస్ లో కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్రసింగ్ యాదవ్ గెలుపొందగా బీజేపూర్ లో బీజు జనతా దళ్ అభ్యర్థి రీటా సాహు దాదాపు 42 వేల ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.

ఏది ఏమైనా రెండు రాష్ట్రాల ఉప ఎన్నికల్లోనూ ఓడిపోవడం BJP కి నష్టం కలిగించే విషయమే. ఇవి ఉప ఎన్నికలు అయినపట్టికి, త్వరలో కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో ఈ ఓటమి ప్రభావం ఎంతోకంత కనిపించే అవకాశం లేకపోలేదు.

Posted On 28th February 2018