CM గా KTR... రాజ్యసభ ద్వారా ఢిల్లీకి KCR
CM గా KTR... రాజ్యసభ ద్వారా ఢిల్లీకి KCR

జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని రెండు రోజుల క్రితం కెసిఆర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రకటించిడమే కాకుండా వేగంగా పావులు కదుపుతూ అందరి మద్దతు కూడగాడుతున్నారు. పచ్చిమబెంగాల్ సియం మమతా బెనర్జీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి మూడో ఫ్రంట్ ఏర్పాటుకు మద్దతు తెలిపారు.

దీనితో బోలెడు ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణ సియం గా KTR ను నియమించి, త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల ద్వారా ఎంపిగా కెసిఆర్ ఢిల్లీ లో అడుగుపెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అలాకాని పక్షంలో ఏప్రిల్ లో జరిగే ప్లీనరీలో KTRకు పార్టీ బాధ్యతలను అప్పగించి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానానికి KCR పోటి చేస్తారని, CM అభ్యర్ధిగా KTR ను ప్రకటిస్తారని సమాచారం. అంతేగాక తనతో పాటు సీనియర్ నాయకులను పార్లమెంటుకు పోటి చేయించబోతున్నారట. ఇప్పటికే తనతో పాటు ఎంపీలు గా పోటీ చేసే సీనియర్ నాయకుల లిస్టు తయారుచేయించారట. వారిలో ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నట్టు సమాచారం.

Posted On 6th March 2018