దద్దరిల్లిన పార్లమెంటు... TDP ఎంపీల నిరసన... కాంగ్రెస్, TRS ఎంపీల మద్దతు
దద్దరిల్లిన పార్లమెంటు... TDP ఎంపీల నిరసన... కాంగ్రెస్, TRS ఎంపీల మద్దతు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు వరుసగా రెండోరోజు తమ పోరాటాన్ని కొనసాగించారు. సభ ప్రారంభం కాగానే TDP లు ఎంపీలు విభజన సమస్యలు, రిజర్వేషన్ల కోటా పెంపు పై ఆందోళన చేపట్టారు. దీనికి TRS కూడా ఎంపీలు మద్దతు తెలుపుతూ ఆందోళన చేపట్టారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తెలుగు ఎంపీలు నినాదాతో సభ నిర్వహణ కష్టమైంది. దీంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

కాంగ్రెస్ ఎంపీల మద్దతు

గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న తెదేపా ఎంపీలకు కాంగ్రెస్‌ ఎంపీలు మద్దతు తెలిపారు. రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరి, కేవీపీ రామచంద్రరావు ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయంగా ఎలాంటి విభేదాలున్నా సమస్యల పరిష్కారంలో మాత్రం కలిసి పోరాడుతామన్నారు.

Posted On 6th March 2018