బ్యాంకులకు 5 రోజులు సెలవులు
బ్యాంకులకు 5 రోజులు సెలవులు

వరుస సెలవులు, సమ్మెలతో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతబడనున్నాయి. అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం డిసెంబరు 21న (శుక్రవారం) సమ్మెకు పిలుపునిచ్చింది, అన్ని స్థాయిల్లో వేతన సవరణ డిమాండ్‌తో బ్యాంకు యూనియన్లు రెండు రోజుల సమ్మెకు దిగాయి. దీంతో బ్యాంకులు పనిచేయవు.

ఇక డిసెంబరు 22 నాలుగో శనివారం, డిసెంబరు 23 ఆదివారం బ్యాంకులకు సెలవులు. డిసెంబరు 24 సోమవారం ఒక్కరోజే బ్యాంకులు పనిచేస్తాయి. ఆ తర్వాత 25న క్రిస్మస్‌ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఇక డిసెంబరు 26న యునైటెడ్ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) సమ్మెకు పిలుపునిచ్చింది.

దీంతో సోమవారం మినహా డిసెంబరు 21 నుంచి 26 వరకు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. వరుస సెలవుల కారణంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.

Posted On 20th December 2018

Source eenadu