పవన్ కు నాదెండ్ల మనొహర్ వెన్నుపోటు
పవన్ కు నాదెండ్ల మనొహర్ వెన్నుపోటు

పవన్ కల్యాణ్‌ను ఉద్ధేశించి రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్లు చేశారు.

‘‘పవన్ కల్యాణ్ అభిమానిగా.. లార్డ్ బాలాజీని వేడుకుంటున్నా.. నాదెండ్ల మనోహర్ వాళ్ల నాన్న.. సూపర్‌స్టార్ యన్.టి.ఆర్‌‌ని వెన్నుపోటు పొడిచినట్లుగా, పవన్ కల్యాణ్‌ని మనోహర్ వెన్నుపోటు పొడవకూడదని. పవన్ అభిమానులందరూ మీ హీరోకు దీనిపై సరైన సూచన చేయండి.
 
ప్రియమైన పవన్ కల్యాణ్ అభిమానులకు.. అప్పట్లో యన్.టి.ఆర్ పక్కన నిలబడి నాదెండ్ల మనోహర్ తండ్రి ఎలా అయితే నవ్వేవాడో.. ఇప్పుడు పవన్ పక్కన నాదెండ్ల మనోహర్ సేమ్ అలాగే నవ్వుతున్నాడు. దీని గురించే నేను ఆందోళన చెందుతున్నాను. దయచేసి మీరైనా పవన్ కల్యాణ్‌కు చెప్పండి జాగ్రత్త అని.
 
పవన్ కల్యాణ్ అభిమానులు తమ స్టార్‌కి చెప్పాల్సింది.. వాళ్ల హీరో ఎంత సూపర్ స్టార్ అయినా.. వెన్నుపోటు నుంచి యన్.టి.ఆర్ కాదు కదా.. పవన్ కల్యాణ్ కూడా తప్పించుకోలేడు అని.
 
పవన్ కల్యాణ్ అభిమానిగా నేను నిజంగా ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే పవన్ కల్యాణ్ ప్రజలకు ఉన్న కష్టాలను తీర్చేందుకు ముందుకు వెళుతుంటే.. నాదెండ్ల మనోహర్ వెనుక నుంచి ఎక్కడ దాడి చేస్తాడో అని.
 
ప్రభుత్వ ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి, జనసేన అంతర్గత వర్గాల నుంచి, నేరుగా నాదెండ్ల మనోహర్ ఇంటి సభ్యుల నుంచి కూడా.. రాజకీయాల పరంగా పవన్ కల్యాణ్‌ను వెన్నుపోటు పొడుస్తాడని నా దగ్గర పక్కాగా సమాచారం ఉంది. ఇది నా దృష్టికి వచ్చింది. పవన్ అభిమానులు తమ హీరోని జాగ్రత్తగా ఉండమని చెప్పండి’’

అంటూ రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమనులను హెచ్చరిస్తూ ట్వీట్ చేసారు.

Posted On 20th December 2018