55 నెలల్లో రూ. 2,021 కోట్లు
55 నెలల్లో రూ. 2,021 కోట్లు

  • 55 నెలల్లో 92 విదేశీ పర్యటనలు
  • మొత్తం పర్యటనల ఖర్చు రూ. 2021 కోట్లు
  • ఒక్కో పర్యటనకు సుమారు రూ. 22 కోట్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలను విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత నుండి ఈ 55 నెలల కాలంలో 92 విదేశీ పర్యటనలకు వెళ్లారు. మొత్తం ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.2,021 కోట్లు. మోదీ ఒక్కో పర్యటనకు సుమారు రూ.22 కోట్ల ఖర్చయింది.

మన్మోహన్ ప్రధానిగా ఉన్న పదేళ్లలో 93 విదేశీ పర్యటనలకు వెళ్లారు. ప్రధాని మోదీ కేవలం నాలుగేళ్ల ఏడు నెలల కాలంలోనే 92 పర్యటనలకు వెళ్లారు. ఇంకో రెండు విదేశీ పర్యటనలు చేస్తే మన్మోహన్ రికార్డును అధిగమిస్తారు. 

కాగా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 15ఏళ్ల పదవీ కాలంలో 113 విదేశీ పర్యటనలు చేసి మొదటి స్థానంలో ఉన్నారు.

Posted On 30th December 2018