వరంగల్ లో ముగ్గురు రైతుల ఆత్మహత్య
వరంగల్ లో ముగ్గురు రైతుల ఆత్మహత్య

ప్రభుత్వాలు మారుతున్నా, రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా రైతు ఆత్మహత్యలు మాత్రం ఆగడంలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం ఒకే రోజు ముగ్గురు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది.

  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన దిడ్డి శ్రీనివాస్‌(వయస్సు 36) వరి సాగు చేస్తుంటాడు. కొన్నేళ్లుగా గిట్టుబాటు ధర లేకపోవడం, అకాల వర్షాలతో నష్టం వాటిల్లింది. దీంతో మనోవేదకు గురై ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
  • వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన బాబు చిన్నమల్లయ్య(వయస్సు 65) పత్తి సాగు చేస్తున్నారు, అయితే గులాబీ రంగు పురుగు సోకి పంట పూర్తిగా నష్టపోయింది. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
  • పరకాల మండలం వరికోల్‌కు చెందిన డైగ మధు(వయస్సు 42) పత్తి సాగు కోసం తీసుకున్న అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Posted On 30th December 2018