AP రియల్‌టైం గవర్నెన్స్‌ అద్భుతం - టోనీ బ్లెయిర్‌

రియల్‌టైం గవర్నెన్స్‌ పనితీరు అద్భుతం అని, అందరికీ స్ఫూర్తిదాయకం అని బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సోమవారం రాత్రి RTGS ను దాదాపు 45 నిమిషాలు ఆసక్తిగా ఆయన గమనించారు. చివరగా చేతులు జోడించి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అమేజింగ్‌.. అంటూ కితాబునిచ్చారు. RTGS ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని, ప్రకృతి విపత్తులను ఆంధ్రప్రదేశ్‌ సమర్థంగా ఎదుర్కొంటున్న తీరు ముచ్చటగొలిపిందన్నారు. ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వం తరఫున నంది వెండి విగ్రహంతోపాటు అరకు కాఫీ ప్యాకెట్‌ని అందజేసి వాటి ప్రత్యేకతలను వివరించారు. టోనీ బ్లెయిర్‌కు గౌరవార్థం సచివాలయంలో ముఖ్యమంత్రి విందు ఇచ్చారు.

Posted On 8th January 2019