TDP లోకి వంగవీటి రాధా... YSRCP కి రాజీనామా

ఆంధ్రప్రదేశ్ లో వంగవీటి కుటుంబం పేరు తెలియని వారుండరు. వంగవీటి రంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. ఆయన వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్, ప్రజారాజ్యం లో పనిచేసి గత కొన్ని సంవత్సరాలుగా YSR కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు.
అయితే ఆయన ఈ రోజు YSR కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో కీలక విషయాలు ప్రస్తావించారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రాధా స్పష్టం చేశారు. అంత వరకూ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.

ఇప్పటికే కొందరు టీడీపీ కీలకనేతలు రాధాతో టచ్‌లో ఉన్నట్లు, ఈ నెల 24 లేదా ఆ తర్వాత వంగవీటి రాధా టీడీపీలో చేరే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. రెండ్రోజుల్లో అనుచరులతో మాట్లాడి ఈ నెల 24 లేదా ఆ తర్వాత రాధా పార్టీలో చేరతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్‌, విజయవాడ తూర్పు, అవనిగడ్డలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండటంతో టికెట్‌ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి, ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని టీడీపీ ప్రతిపాదించిందని తెలుస్తోంది. అయితే టీడీపీ ప్రతిపాదనతో రాధా సుముఖత వ్యక్తం చేశారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

Posted On 20th January 2019