పంచాయతీ ఫలితాల్లో TRS జోరు
పంచాయతీ ఫలితాల్లో TRS జోరు

తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో TRS మద్దతుదారులు భారీ సంఖ్యలో విజయ దుందుభి మోగించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ తప్పించి మిగిలిన పార్టీలేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. TRS హోరులో కూడా, స్వతంత్ర అభ్యర్థులు చాలా చోట్ల తమ సత్తా చాటుకున్నారు.

మొదటి దశలో 4479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు నోటీసు ఇవ్వగా, తొమ్మిది పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 769 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3701 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.

పోలింగ్ వివరాలు:
85.76 శాతం పోలింగ్‌ నమోదు కాగా మొత్తం 41,56,414 ఓట్లు పోలయ్యాయి.యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 95.32 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి తక్కువగా 78.47 శాతం ఓట్లు పోలయ్యాయి. 

ఫలితాల వివరాలు:
TRS - 2629
కాంగ్రెస్‌ - 920
TDP - 31
భాజపా - 67
CPI - 19
CPI (M) - 32
ఇతరులు - 758
ఫలితాలు వెలువడనివి - 14
( కొన్ని కారణాల వల్ల ఈ 14 పంచాయతీల్లో ఫలితాలు ఇంకా వెలువడలేదు )

Posted On 22nd January 2019