YSR కాంగ్రెస్ లో చేరిన... TDP ఎమ్మెల్యే

ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి YSR కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈనెల 31న అధికారికంగా YSRCP కండువా కప్పుకోనున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో జగన్‌ తో సమావేశమైన ఆయన చాలా సేపు చర్చలు జరిపారు. కాగా వచ్చే ఎన్నికల్లో మల్లికార్జునరెడ్డి బదులు ఆయన తమ్ముడు రఘునాథరెడ్డి రాజంపేట అభ్యర్థిగా పోటీ చేస్తారని సమాచారం.

ఆయనకు పార్టీ మారడం కొత్తేమీ కాదు. 2014 ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీలో చేరిన మేడా, కడప జిల్లా నుంచి తెదేపా తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. దాంతో పార్టీలో కూడా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆయనకు విప్ పదవి, ఆయన తండ్రికి TTD పాలకమండలి సభ్యత్యం ఇచ్చి సముచిత స్థానం కల్పించారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే YSR కాంగ్రెస్ లోకి
జగన్‌తో చర్చల తర్వాత మల్లికార్జునరెడ్డి మీడియాతో మీడియాతో మాట్లాడిన ఆయన రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైకాపాలో చేరినట్టు చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణామాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, నిరుద్యోగ యువతకు భృతి ఇస్తానని, కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని నమ్మించి ద్రోహం చేశారని విమర్శించారు. చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదన్నారు.

Posted On 22nd January 2019