ఎన్టీఆర్ దొంగ... రామ్ చరణ్ పోలీసు

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న RRR సినిమా లో ఎన్టీఆర్ దొంగ పాత్రలో నటిస్తారని... ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ పాత్రలో చరణ్ నటిస్తారని... ఈ కథ అంతా అటవీ నేపధ్యంలో సాగుతుందని సినిమా వర్గాల్లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో చాలానే వచ్చాయి. ధూమ్ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ ఇదే తరహా కథాంశంతో ఉంటాయి.

రాజమౌళి ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా తీయడని, ఈ ప్రచారం తప్పని కొంతమంది వాదిస్తుండగా... మరికొందరు ఇదే తరహా కథ అయితే తప్పేంటని, రాజమౌళి తనదైన శైలిలో తెరకెక్కిస్తాడని వాదిస్తున్నారు.

ఏది ఏమైనా బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడం... ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. కాగా ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నారు.

Posted On 22nd January 2019