అఖిల్ దర్శకుడితో, విజయ్ దేవరకొండ సినిమా
అఖిల్ దర్శకుడితో, విజయ్ దేవరకొండ సినిమా

వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో యువతకు బాగా దగ్గరైన విజయ్, గీత గోవిందం తో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగానే కనెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం విజయ్ " డియర్ కామ్రేడ్ " అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే అఖిల్ తాజా చిత్రం " మిష్టర్ మజ్ను " దర్శకుడు వెంకీ అట్లూరి తో విజయ్ తదుపరి చిత్రం ఉండబోతుంది అనే వార్త చక్కర్లు కొడుతోంది. వెంకీ అట్లూరి మొదటి చిత్రం " తొలిప్రేమ " తో ఇంప్రెస్ అయిన విజయ్, వెంకీ అట్లూరి చెప్పిన కథను వెంటనే ఒప్పుకున్నారని, త్వరలోనే అధికారికంగా ఈ సినిమా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

Posted On 23rd January 2019