బిగ్ బాస్ 3 హోస్ట్ గా ఎన్టీఆర్ ?
బిగ్ బాస్ 3 హోస్ట్ గా ఎన్టీఆర్ ?

ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 స్టార్ మా టీవీలో ప్రసారమై విజయవంతమైన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని బిగ్బాస్ కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్లిందంటే కారణం ఖచ్చితంగా ఎన్టీఆర్ అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.

బిగ్ బాస్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. కారణాలేవైనా సీజన్ 1 సక్సెస్ అయినంత రేంజ్ లో సీజన్ 2 సక్సెస్ కాలేకపోయింది. అయితే స్టార్ మా యాజమాన్యం మళ్లీ ఎన్టీఆర్ ని సంప్రదించి బిగ్ బాస్ 3 హోస్ట్ గా వ్యవహరించేందుకు ఒప్పించినట్లు ప్రచారం సాగుతోంది.

అయితేవెంకటేష్ గాని, నాగార్జున గాని హోస్ట్ గా వ్యవహరిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ బిగ్ బాస్ 3 హోస్ట్ గా వ్యవహరిస్తారని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇదే గనుక నిజమైతే బిగ్ బాస్ 3 సూపర్ సక్సెస్ అవుతుందని సందేహం లేదు.

కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమా కి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా రెండవ షెడ్యూల్ కూడా ఈ మధ్యనే ప్రారంభమైంది.

అయితే ఎంత ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ షో ని హోస్ట్ చేయడానికి ఒప్పుకుంటాడా, ఒకవేళ ఎన్టీఆర్ ఒప్పుకున్న రాజమౌళి అంగీకరిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Posted On 27th January 2019