వ్యాన్ ఛేజ్ చేసి, ఆవులను రక్షించిన రాజా సింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్... వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే ఆయన గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. గోరక్షణ లాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

అయితే తాజాగా జరిగిన ఓ ఘటనతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. కబేళాకు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 100 ఆవులను రక్షించారు. సమాచారం వచ్చిన వెంటనే ఆ వ్యాన్ ని ఛేజ్ చేసి మరీ అడ్డుకోవడమే కాకుండా, వ్యాన్ పైకి ఎక్కి ఆవులను పరిశీలించారు. "ఆవులను చంపడం హిందూ ధర్మం కాదని, వాటిని ప్రభుత్వం రక్షించుకోవాలని" ఆయన అన్నారు.

Posted On 28th January 2019