సైరా లో అల్లు అర్జున్
సైరా లో అల్లు అర్జున్

చిరంజీవి హీరోగా... అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, జగపతి బాబు, సుదీప్ ప్రధాన పాత్రల్లో... రామ్ చరణ్ నిర్మాత గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న చిత్రం 'సైరా'. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య‌ స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. చిత్రం 'సైరా'.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక ముఖ్య పాత్ర‌లో నటిస్తున్నారట. త్వ‌ర‌లో షూటింగ్‌లో కూడా పాల్గొన‌బోతున్న‌ట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజమైతే మెగా అభిమానులకు పండగే.

Posted On 14th February 2019