గుంటూరు పశ్చిమ... సీనియారిటీకే మొగ్గు
గుంటూరు పశ్చిమ... సీనియారిటీకే మొగ్గు

ఎన్నికల షెడ్యూల్ రావడంతో పెండింగ్ లో ఉంచిన స్థానాల ఎంపికలో తెలుగుదేశం పార్టీ వేగం పెంచింది. గుంటూరు పశ్చిమ విషయానికొస్తే మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు ఖరారైనట్లు సమాచారం.

ఈ స్థానం నుంచి చాలా మంది రేసులో ఉన్నప్పటికీ సీనియారిటీకి, పనితీరుకీ ప్రాధాన్యమిచ్చి మన్నవ సుబ్బారావును ఎంపిక ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, నామినేషన్ కు పెద్దగా సమయం లేకపోవడంతో పార్టీలో  సీనియర్ నాయకుడు అవడం మరియు అటు ప్రజలు, ఇటు పార్టీ వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం చేత మన్నవ సుబ్బారావు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

గుంటూరు టిడిపి లోనే సీనియర్ నేతగా, పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన వ్యక్తిగా మన్నవకు మంచి పేరు ఉంది. నియోజకవర్గంలోని నేతలతో ఆయన మంచి సంబంధాలు కలిగిఉన్నారు.  మిర్చి యార్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్నందువల్ల నియోజకవర్గ ప్రజలతోనే కాక, చుట్టు పక్కల ప్రాంతాల రైతులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి.

అంతేగాక ఆర్ధిక అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన స్నేహితుడైన ఒక పారిశ్రామికవేత్త నుంచి ఆర్ధిక పరంగా అండదండలు ఉండడంతో పాటు, NRI లు అయిన కుమారుడు, కుమార్తె తరుపున కూడా ఆర్థికంగా మంచి సపోర్ట్ కలిగియున్నారు. చంద్రబాబుతో భేటీ సమయంలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావనకు తీసుకొచ్చినట్లు సమాచారం. సోమవారం టికెట్ పైనా, ఇతర విషయాలు చర్చించడానికి ఆహ్వానం అందింది అని తెలుస్తోంది.

ఇవన్నీ ద్రుష్టి లో ఉంచుకొని అధిష్టానం టికెట్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇదే టికెట్ ఆశిస్తున్న ఆశావహులకు బుజ్జగింపు చర్యలు చేపట్టమని పార్టీ వర్గాలను ఆదేశించారు.

Posted On 10th March 2019