వివేకా హత్య కేసు, అదుపులో జగన్ అనుచరుడు
వివేకా హత్య కేసు, అదుపులో జగన్ అనుచరుడు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో జగన్‌ ముఖ్య అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్ననే కడప పార్లమెంట్‌ ఆర్జేడీ అభ్యర్థిగా శివశంకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం విశేషం.

ఇప్పటికే శివశంకర్‌రెడ్డిని  రెండు సార్లు విచారించిన పోలీసులు... పులివెందులకు చెందిన నాగప్ప, ఆయన కుమారుడు శివను కూడా పోలీసులు అధికారులు ప్రశ్నిస్తున్నారు. కడపలోని ఓ రహస్య స్థావరంలో 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 40 మంది సాక్షులను పోలీసులు విచారించారు.

ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు కోణంలోనూ, కుటుంబ కలహాల కోణంలోనూ సిట్‌ విచారణ జరుపుతోంది. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వరెడ్డి, కిరాయి హంతకులు శేఖర్‌రెడ్డి ఈ హత్యకేసులో ప్రధాన నిందితులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం లోపల కొందరు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Posted On 22nd March 2019