విడాకులు తీసుకోనున్న ప్రియాంక చోప్రా ?
విడాకులు తీసుకోనున్న ప్రియాంక చోప్రా ?

ప్రియాంక చోప్రా, సింగర్ నిక్ జోనస్ తో డేటింగ్, ఆ తర్వాత వివాహం చేసుకోవడం గురించి అందరికీ తెలిసిందే. గతేడాది డిసెంబరులో జోద్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్‌లో ఘనంగా వివాహం చేసుకుంది.
హిందూ, క్రైస్తవ సంప్రదాయాలలో ప్రియాంక, నిక్ జోనస్ పెళ్లి జరగగా, ఈ పెళ్లికి అతిరథమహారథులు తరలివచ్చారు.

అయితే అమెరికాకు చెందిన ఓ మ్యాగజైన్ సంచలన వార్తను ప్రచురించింది. పెళ్లైన మూడు నెలలకే వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు ఆ మ్యాగజైన్ చెబుతోంది. ఆ మ్యాగజైన్ చెప్పిన కథనం ప్రకారం, ప్రియాంకలో పెళ్లి తర్వాత చాలా మార్పు వచ్చిన్టటు, భర్తతో కోప్పడుతున్నట్టు తెలిపింది. అంతేకాకుండా పెళ్లి తరువాత పిల్లల్ని కని గృహిణిలా ఉంటుందనుకుంటే అలా కాకుండా 20 ఏళ్ల అమ్మాయిలా ప్రవర్తిస్తున్నట్టు నిక్ తల్లిదండ్రులు గుర్తించినట్టు మ్యాగజైన్ చెప్పింది. దీంతో నిక్ కుటుంబసభ్యులు ఆమెతో తెగదెంపులు చేసుకోమని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రియాంక నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.

Posted On 1st April 2019