‘జై లవకుశ’ చిత్రానికి అరుదైన గౌరవం
‘జై లవకుశ’ చిత్రానికి అరుదైన గౌరవం

జూ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జై లవకుశ’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. కొరియాలో నిర్వహించిన ‘బుచాన్‌ ఇంటర్నేషనల్‌ ఫెన్టాస్టిక్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్’‌(BIFFF)లో ఉత్తమ ఆసియా చిత్రాలు (Best of Asia) విభాగంలో శనివారం ఉదయం ఈ సినిమాను ప్రదర్శించారు. BIFF లో స్థానం సంపాదించుకున్న తెలుగు సినిమాగా ఈ సినిమా మరో ఘనత సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా, ఎన్టీఆర్ అన్నయ్య కల్యాణ్‌రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయకలుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించారు.

Posted On 21st July 2018