జగన్‌పై మండిపడ్డ ముద్రగడ
జగన్‌పై మండిపడ్డ ముద్రగడ

కాపు రిజర్వేషన్లపై యూటర్న్ తీసుకున్న జగన్‌పై ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. ‘కాపు రిజర్వేషన్‌పై హామీ ఇవ్వలేనన్న మీకు.. మేమెందుకు ఓటు వేయాలి’ అని సూటిగా ప్రశ్నించారు. తుని బహిరంగ సభ రోజున, అసెంబ్లీలో కాపుల డిమాండును సమర్థించి, ఇప్పుడు కాపు రిజర్వేషన్‌ అంశం రాష్ట్ర పరిధి కాదు.. కేంద్రం చేయాల్సిన పని అని జగన్‌ చెప్పడం బాధగా, వింతగా ఉందన్నారు. కాపులను అవమానించడం సరికాదని, జగన్‌కు కాపులంటే ఎందుకంత చిన్నచూపు అని నిలదీశారు. పదవీకాంక్ష కోసమే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని.. కాపులను విమర్శించి ఇతర కులాలకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

రాజమండ్రి వంతెన వద్ద జగన్‌ పాదయాత్రకు ఎదురు వెళ్లి స్వాగతం పలకమని ఆయన అనుచరుల ద్వారా కోరారన, అప్పుడు ‘ఏం చేశారని, ఏం చేస్తారని ఎర్ర తివాచీ వేసి స్వాగతం పలకాలి’ అని నిరాకరించినందుకు కోపంతో కాపులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

Posted On 30th July 2018