జోగిని శ్యామల కంటతడి, KCR ప్రభుత్వంపై శాపనార్ధాలు
జోగిని శ్యామల కంటతడి, KCR ప్రభుత్వంపై శాపనార్ధాలు

మహిళలను కించపరిస్తే పుట్టగతులు ఉండవని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న అధికారులు మహిళల ఇబ్బందుల్ని పట్టించుకోవడం లేదన్నారు. మహిళలు ఒక్కొక్కరు దాదాపు 10 కిలోల బరువు బోనంతో లైనులో నిల్చున్నారని, అయినా అవేమీ పట్టించుకోకుండా వీఐపీలు వస్తున్నారంటూ గంటల తరబడి భక్తుల క్యూలైన్లను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుస్తూ శాపనార్థాలు పెట్టారు. వీఐపీలు వచ్చిన సందర్భంలో జరిగిన తోపులాటకు కొందరు మహిళలు కూడా కంటతడి పెట్టారు. అమ్మవారిని దర్శించుకోకుండా వెనుదిరిగారు.

Posted On 30th July 2018