మహేష్ @19 ఇయర్స్ ఇండస్ట్రీ
మహేష్ @19 ఇయర్స్ ఇండస్ట్రీ

మహేష్ బాబు సినీరంగ ప్రవేశం చేసి ఈ రోజుతో 19 ఏళ్లు పూర్తయ్యాయి. నీడ సినిమాలో బాల నటుడిగా సినీ రంగానికి పరిచయమైన సూపర్ స్టార్ మహేష్ బాబు పోరాటం, బజార్ రౌడీ, కొడుకుదిద్దిన కాపురం వంటి 8 సినిమాలలో బాల నటుడుగా నటించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజ కుమారుడు సినిమాతో హీరోగా మారారు.

ఈ 19 సంవత్సరాలలో హీరో గా 24 సినిమాలలో నటించిన మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్నారు.

Posted On 30th July 2018