ఈ ఏడాది భక్తులు ఇబ్బంది పడ్డారు, స్వర్ణలత భవిష్యవాణి
ఈ ఏడాది భక్తులు ఇబ్బంది పడ్డారు, స్వర్ణలత భవిష్యవాణి

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా అమ్మవారు స్వర్ణలత అనే మహిళ ద్వారా భవిష్యవాణి వినిపించారు. దర్శనానికి ఏటా భక్తులు సంతోషంగా వచ్చేవారని, ఈ ఏడాది మాత్రం దుఃఖంతో వచ్చారని స్వర్ణలత అన్నారు.

‘ నాకు ముక్కుపుడక తెచ్చినవారినే కాక ప్రజలందరినీ ఆశీర్వదిస్తా. ఎప్పుడూ న్యాయం పక్షానే నిలబడతా. న్యాయం పక్షాన నిలబడిన వారికి ఆపద కలిగించను. ఈ ఏడాది సమర్పించిన బంగారు బోనం నాకు కొంత సంతోషాన్ని, కొంత బాధను కలిగించింది. నా దర్శనానికి వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టొద్దు. ఆడపడుచులందరూ దుఃఖంతో ఉన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి’ అని భవిష్యవాణి వినిపించారు.

Posted On 30th July 2018