నందిగామ వదిలి 2 సార్లు గెలిచా, జగన్ అలా గెలవగలడా
నందిగామ వదిలి 2 సార్లు గెలిచా, జగన్ అలా గెలవగలడా

జగన్‌ తన నియోజకవర్గం పులివెందులకు వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన నీళ్లు చూడాలని మంత్రి దేవినేని ఉమ అన్నారు. రాయలసీమలో నీళ్లు జగన్‌కు కనపడవని, రానున్న రోజులలో జగన్‌కు పులివెందుల ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. జగన్ డ్రామాలు ఆడతున్నారని అన్నారు.

40 సంవత్సరాలుగా తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతానికి వైఎస్‌ నీళ్ళు ఇవ్వలేక పోయారని, జగన్‌కు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. నందిగామను వదిలి తాను రెండు సార్లులు గెలిచానని, జగన్ కూడా పులివెందుల నుంచి బయటికి వచ్చి గెలవాలని సవాల్‌ విసిరారు.

రాజీనామా చేసిన జగన్ ఎంపీలు అతనికి కూడా కనపడడం లేదని, జగన్ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పవన్, జగన్‌కు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనడటం లేదని, తెదేపాను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు ప్రతిపక్ష హోదా కుడా దక్కదని జోస్యం చెప్పారు.

Posted On 30th July 2018