వేరే ఆప్షన్‌ లేక, సమంతను పెళ్లి చేసుకున్నా
వేరే ఆప్షన్‌ లేక, సమంతను పెళ్లి చేసుకున్నా

వేరే ఆప్షన్‌ లేక, సమంతను పెళ్లి చేసుకున్నా

తమ పెళ్లి గురించి సరదా వ్యాఖ్యలు చేసాడు నాగచైతన్య. వేరే ఆప్షన్ లేక సమంతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని నాగచైతన్య అన్నారు. సుశాంత్ తాజా చిత్రం ‘చి.ల.సౌ’  ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాగచైతన్య

ఆ ఆసక్తికర సంభాషణ ఇలా జరిగింది…

రాహుల్: నేను చిన్మయికి ప్రపోజ్‌ చేశాక ఏడాదిన్నరకు ఒప్పుకొంది. అది కూడా ఆమెకు ప్రేమ గురించి, పెళ్లి గురించి వివరిస్తే తప్ప అర్థం కాలేదు. నీ ప్రేమ గురించి చెప్పు చైతూ…?


సమంత: ఒక్క మాటలో చెప్పేస్తాడు చూడు


నాగచైతన్య: ‘నాకు సమంత ‘ఏ మాయ చేశావె’ నుంచి తెలుసు. ఏడేళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. చివరకు పోన్లే పాపం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నాడు కదా అని రెండేళ్ల క్రితం ఓకే చెప్పింది. అప్పటి నుంచి ప్రేమించుకున్నాం. కానీ పదేళ్లకు పెళ్లిచేసుకోవాల్సి వచ్చింది. వేరే ఆప్షన్‌ లేక అన్నారు (నవ్వుతూ).


సమంత: నీ గురించి బయట చాలా బ్యాడ్‌గా విన్నా బాబూ. రాహుల్‌ రామ్మా ఇక్కడికి, పబ్లిక్‌గా ఎంత అబద్ధం చెప్తున్నాడో చూడు


రాహుల్: జెస్సీ రెండు గంట్లల్లో ఒప్పుకొంటే..సమంత రెండేళ్లకు ఒప్పుకొందా?


సమంత: నేను ఆయన వెంట మాత్రమే పడ్డాను. కానీ చైతూ చాలా మంది అమ్మాయిల వెంట పడ్డాడు. అందరు అయిపోయిన తర్వాత లాస్ట్‌ టోకెన్‌ నాదే.


రాహుల్: చైతూ… నీకు సమంతనే రైట్‌ చాయిస్‌ అని ఎందుకు అనిపించింది?

సమంత: ఎందుకంటే నేను పర్‌ఫెక్ట్‌

నాగచైతన్య: నా లైఫ్‌లో చాలా మంది అమ్మాయిలు లేరు. అదంతా మసాలా. ప్రతిదానికీ ఓ సమయం అంటూ ఉంటుంది కదా..ఇది కూడా అలాగే జరిగిపోయింది. మా ప్రేమను మరో అడుగు ముందుకు తీసుకువెళ్లాలని ఇద్దరం డిసైడ్‌ అయ్యాం. అవన్నీ అందమైన క్షణాలు.  మీ అందరికీ తెలుసు. మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌

Posted On 31st July 2018