కాస్టింగ్ కౌచ్ వ‌ల్లే, ఎక్కువ సినిమాలు చేయ‌లేక‌పోయా
కాస్టింగ్ కౌచ్ వ‌ల్లే, ఎక్కువ సినిమాలు చేయ‌లేక‌పోయా

అదితీ రావు హైద‌రీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… నేను సినిమాల్లోకి వ‌చ్చి 10సంవత్సరాలు దాటింది. కానీ కాస్టింగ్ కౌచ్ కార‌ణంగా ఎక్కువ సినిమాలు చేయ‌లేక‌పోయా. కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆఫ‌ర్ ఇస్తాన‌ని ఓ బాలీవుడ్ నిర్మాత నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. అయితే అందుకోసం కాంప్ర‌మైజ్ కావాల‌ని కోరాడు. నాకు చాలా కోపం వ‌చ్చి అక్క‌ణ్నుంచి వ‌చ్చేశా. ఎంత ధైర్యం వాడికి, త‌ప్పుడు దారుల్లో వెళ్లి అవ‌కాశాలు సంపాదించుకోవ‌డం అవ‌స‌ర‌మా అనిపించింది. అందువ‌ల్ల చాలా నెల‌లు ఖాళీగా ఉండిపోయా. త‌ర్వాత అవ‌కాశాలు వాటంత‌ట అవే వ‌చ్చాయి. టాలెంట్ ఉంటే నిజాయితీగా ఉంటూ కూడా సినిమాల్లో రాణించ‌వ‌చ్చ‌ని అర్థ‌మైంద‌`ని అని అన్నారు.

న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అటు బాలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లోనూ వ‌రుస ఆఫ‌ర్లతో దూసుకుపోతోంది.

Posted On 31st July 2018