అవయవదానానికి ముందుకొచ్చిన చంద్రబాబు
అవయవదానానికి ముందుకొచ్చిన చంద్రబాబు

అవయవ దానం చేసేందుకు తాను సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావేదిక హాల్‌లో ప్రకటన చేశారు. అవయవ దానాన్ని పాఠ్యాంశాల్లో ఒక అంశంగా పెడతామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో అవయవదానం ఒక షరతుగా పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
చంద్రబాబు పిలుపుతో ముందుకొచ్చిన లక్ష మంది
పది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్చందంగా లక్షా ఇరవై వేల మంది అవయవ దాతలు ముందుకు వచ్చారు. వారికి ఇచ్చిన పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో జీవన్‌దాన్‌ సంస్థకు మెప్మా అందజేసే కార్యక్రమం ప్రజావేదిక వద్ద నిర్వహించారు. దిల్లీకి చెందిన ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ వర్మ ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్‌లోకి ఈ చారిత్రక ఘట్టాన్ని నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు. తన పిలుపునకు స్పందించి ఇంతమంది ముందుకు రావడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. 

Posted On 6th August 2018